
సజ్జల రామకృష్ణారెడ్డి
* చంద్రబాబు అండ్ ముఠావి దిగజారుడు రాజకీయాలు
* ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విష ప్రచారం
* తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాతే కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంది
* నాడు అసెంబ్లీలో చంద్రబాబు యాక్ట్ కు మద్దతు ఇచ్చారు
* అబద్దాలను నమ్మకండని ప్రజలకు పిలుపు
* ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి
ఆకేరు న్యూస్, తాడేపల్లి : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్ట విరుద్ధం అని దమ్ముంటే మోదీ, అమిత్ షాలతో చంద్రబాబునాయుడు చెప్పించాలని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో జరిగిన తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాతే కేంద్రం ఈ స్టాంపింగ్ విధానం మార్చాలని నిర్ణయించిందని వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ సమాజంలో ఉండడానికి వీల్లేని వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఏదో జరిగిపోతుందని ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్ కు ఓటు వేయకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలే అయితే.. చంద్రబాబు వాటిని చించేయాలి సూచించారు. శాసనసభ, శాసనమండలిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు తెలుగుదేశం మద్దతు ఇచ్చి, ఇప్పుడు వ్యతిరేకిస్తూ అడ్డంగా బుక్ అయిందని వివరించారు. 2019 జూలై 19న టీడీపీ ఈబిల్లుకు మద్దతు ఇచ్చినట్లుగా సంబంధిత వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. అలాగే, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇటీవల కొన్న ఆస్తుల పత్రాలను చూపించి, అవన్నీ పనిచేయవా అని ప్రశ్నించారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. యాక్ట్ పై ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.
—————————–