* కార్పోరేట్ల నుంచి దేశాన్ని రక్షించుకుందాం
* 20 కోట్ల ఉద్యోగాలే వి ..?
* అసహనంలో బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు
– మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
త్యాగాల పునాదులపై రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ని ప్రధానమంత్రిని చేద్దాం.. కార్పోరేట్లబందిఖానా నుంచి దేశాన్ని రక్షించుకుందామని రాష్ట్ర పంచాయితీ రాజ్ , శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ( Seethakka ) పిలుపునిచ్చారు. శనివారం తుక్కుగూడాలో జరిగిన జనజాతర బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పదేండ్ల బీజేపీ పాలనలో దేశాన్ని కార్పోరేట్లకు తాకట్టు పెట్టారన్నారు. నల్ల చట్టాలు తెచ్చి రైతులను రోడ్డుమీదకు ఈడ్చారు. నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారు. మతం, కులాల పేరుతో దేశాన్ని విద్వేష పూరితంగా మార్చారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేస్తూ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాందీ. ప్రజలూ , కార్యకర్తలూ నాయకులు ఆలోచించండి ఒక్క అవకాశం రాహుల్ గాంధీ
ని ప్రధాన మంత్రి చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్దులు కావాలి. రాష్ట్రం లోని 17 ఎంపీ సీట్లను గెలిపించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. ఆనాడు ఇదే తుక్కుగూడలో భారీ బహిరంగ సభలో పదేండ్ల గడీల పాలన ను పాతరేస్తామని శపథం చేశారు. అనుకున్నట్టుగానే పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకు మీ అందరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ కూడా బలుక్కుని గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని కళలు కన్నారు. ప్రజలు వాళ్ళ కలల్ని కల్లలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారన్నారు.
* 20 కోట్ల ఉద్యోగాలు ఏవి ..?
నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అన్నాడు. ఆ లెక్క పదేండ్ల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. నిజంగా ఉద్యోగాలు రానే లేదు. ఉద్యోగాల గురించి అడిగితే అయోధ్యను చూపెడుతున్నారు. అయోధ్యలో ఉన్న రామున్ని చూపెడుతున్నారు. పదేండ్ల అభివృద్ధి ఏదని మోదిని అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు గాని అక్షింతలు మాత్రం పంపిస్తున్నారు. .
పది సంవత్సరాల మోది పాలన గురించి చెప్తే… రాస్తే రామాయణమంతా.. చెప్తే భారతమంతా అవుతుంది .. వికసిత్ భారత్ కాదు, విద్వేషపు కుట్రలు, విధ్వంశాలతో భారతదేశాన్ని బందీ చేశారు.
ఇందుకు భిన్నంగా పేదల పెన్నిధి, త్యాగాల వారధి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాక పాదయాత్ర చేసిన మహా నాయకుడు. ఇక్కడ కూర్చున్నటువంటి ఎంతో మందికి అవకాశాలు రావడానికి కారణం ఇందిరమ్మ కుటుంబం . మీరు కూడా సర్పంచ్ లుగా ఎంపీటీసీలుగా, జెడ్పి టీసీ లుగా అయ్యారు. 34 ఏండ్ల తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీకి ఇచ్చి ప్రధాన మంత్రి చేయడం కోసం ప్రతి కార్యకర్త నాయకుడు కష్టపడాలని కోరుకుంటున్నానని సీతక్క అన్నారు.
* అసహనంతో బీఆర్ ఎస్ – బీజేపీ ..
అధికారం పోయినటువంటి అసహనం తోటి బీఆర్ఎస్ నాయకులు మరి పిచ్చి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు . ఇక బీజేపీ నాయకులూ కూడ మరి రోడ్ మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. బహుళ జాతి కంపెనీల కోసం వ్యవసాయాన్ని ముంచడం కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చింది మోది నాయకత్వంలో ని బీజేపీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. నల్ల చట్టాలకు వ్యతి రేకంగా పోరాడుతున్న రైతుల మీద కాల్పులు మోది ప్రభుత్వం కాదా అని అడిగారు. గిరిజన ,ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ వనరులను దోచుకోవడం కోసం ఆదివాసీ , గిరిజన యివతను హక్కులను కాలరాస్తున్న కార్పోరేట్ మోది వ్యవస్థేనని మంత్రి సీతక్క అన్నారు..
——————————