
మంత్రి ధనసరి అనసూయ సీతక్క
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః జీవో 49 ను వ్యతిరేకిస్తూ నిన్న మావోయిస్టు అధికార ప్రతినిది జగన్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. తెల్సిందే ఆ లేఖలో మంత్రి సీతక్క తీరును మావోయిస్టులు ప్రశ్నించారు. సీతక్క ఉద్యమ నేపధ్యంతో పాటు ఆదివాసీ బిడ్డ అయి ఉండి జీ వో 49పై మాట్లాడక పోవడం విచిత్రంగా ఉందని సీతక్కనుద్దేశించి ఆ లేఖలో పేర్కొన్నరు. దీనిపై సీతక్క స్పందిస్తూ తన మూలాలను ఎప్పడూ మరిచిపోలేదన్నారు.శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగులో మంత్రి సీతక్క విలేకర్లతో మాట్లాడుతూ.. జీవో 49ను తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టానని వివరించారు.ఆదివాసీల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతోపాటు తానూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
………………………………..