
* పార్టీ పేరు ప్రకటన..కార్యవర్గం ఖరారు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ వేదికపై కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పేరు ప్రకటించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హోటల్ తాజ్ కృష్ణలో బుధవారం తన లనుచరులతో సమావేశమైన తీన్మార్ మల్లన్న పార్టీ పేరును కార్యవర్గాన్ని ప్రకటించారు. పైన ఎరుపు కింద ఆకు పచ్చ రంగుతో పార్టీ జెండాను రోపొందించారు.మధ్యలో కార్మిక చక్రం దాని నుంచి పిడికిలి బిగించిన చేయి దాని చుట్టూ ఆలీవ్ ఆకులను ఏర్పాటు చేశారు.త్వరలో పూర్తి స్థాయి కార్యచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.
………………………………………………