
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఏడుగురు నిషేధిత సిపిఐ మావోయిస్టులు జిల్లా ఎస్పీ శబరిష్ ఎదుట శనివారం లొంగిపోయారు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసులు సిఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులు సంయుక్తంగా ఆదివాసి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో పనిచేస్తున్న ఏడుగురు సభ్యులలో నలుగురు మహిళలు ముగ్గురు యువకులు లోంగిపోయారు. వీరిలో తాటి ఊంగి, కోడం సుక్కు, సోడి బీమి, కుంజం వరలక్ష్మి, పధ్ధం జోగా, కోర్స పోయికి, సోడి హడ్మాలు ఉన్నారు వీరందరికీ ఒక్కొక్కరికి 25 వేల చొప్పున 1,75,000 పోలీస్ అధికారులు వారికి అందజేశారు మిగతా 7 లక్షల ను వారి వారి బ్యాంక్ ఖాతాలో చెక్కుల రూపంలో జమ చేయడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోరుకన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే నినాదాన్ని నమ్మి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు లొంగిపోయిన వారికి తక్షణ ఆర్థిక సహాయం తో పాటు పునరావాస సదుపాయాలు అందించబడతాయని ఏ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సివిల్ సిఆర్పిఎఫ్ పోలీసులు పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
………………………………..