Rayaparthy Congress Leaders Join BRS
ఆకేరు న్యూస్,రాయపర్తి: రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువజన నాయకులు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు.
రాయపర్తి మండల పరిధిలోని బందనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు గుగులోత్ గణేష్, గుగులోత్ వీరన్న, భూక్య శ్రీకాంత్ లతో పాటు ఊకల్లు గ్రామానికి చెందిన టేకుల తండా కాంగ్రెస్ యువజన నాయకుడు భూక్య సునీల్ శనివారం బీఆర్ఎస్ మండల కార్యాలయంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ ఛైర్మన్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మూనావత్ నరసింహ నాయక్ సమక్షంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరగా… పార్టీ నాయకులు వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజల సంక్షేమ,హక్కుల సాధన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. యువత భాగస్వామ్యంతో మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి పిఎసిఎస్ చైర్మన్ కొండూరు రామచంద్రారెడ్డి మండల నాయకులు చందు రామ్, సంకినేని ఎల్ల స్వామి, భూక్యదీప్లా సుధాకర్, పామ్ మనోహర్, నరేందర్, భాస్కర్,బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
