* పాశ్చాత్య దేశాల నుంచి మన దేశంలోకి.. ‘‘సైబ్రోతల్స్’’
* వ్యభిచారగృహాల్లో రోబోలతో శృంగారం
* ఏఐ ఆధారిత సెక్స్ టాయ్స్ తో సుఖంతో పాటు నష్టాలు కూడా..
ఆకేరు న్యూస్ డెస్క్ : బ్రోతల్స్హౌస్ అంటే చాలామందికి తెలిసిందే.. అదే వ్యభిచారగృహం. గతంలో చాలా ఊళ్లు, నగరాల్లో వ్యభిచార గృహాలు ఉండేవి. కొన్ని ఊళ్ల పేరు చెబితే చాలు.. అవే గుర్తుకువచ్చేలా వ్యవహారాలు నడిచేవి. రానురాను ఆ సంస్కృతి తగ్గుతూ వచ్చింది. అయితే, తెరపైకి హైటెక్ వ్యభిచార గృహాలు వచ్చాయి. చిన్న చిన్న లాడ్జిల నుంచి కొన్ని స్టార్ హోటళ్లలోనూ అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. పట్టుబడ్డ ఘటనలు చాలానే వెలుగుచూశాయి. సాంకేతిక యుగంలో వ్యభిచార గృహ కార్యకలాపాలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అమ్మాయిలు, మహిళలతో నడిచే వ్యభిచార గృహాలను ఇప్పుడు రోబో(Robo)లతో నడిపిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోకి కూడా పాకింది.
సైబ్రోతల్స్..
సైబ్రోతల్స్..(Cybrothels) రోబోలతో నిర్వహించే వ్యభిచారగృహాలు. పాశ్చాత్యదేశాల్లో ఇవి కొనసాగుతున్నాయి. మన దేశంలోని గోవా(Gova)లో కూడా ‘సైబ్రోతల్స్’ నడుస్తున్నాయి. ఇక్కడ మనుషులు కాకుండా, రోబోలు పడక సుఖాన్ని అందిస్తాయి. ఏఐ ఆధారిత టాక్స్ ఉంటాయి. సెక్స్ టాయ్స్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. అయితే, కొత్తగా ఏఐ టెక్నాలజీతో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ‘సైబ్రోతల్స్’ హౌస్లో ఉండే ఏఐ సెక్స్ టాయ్స్ తమ వద్దకు వచ్చిన విటుల తీరును, వారి మానసిక, శారీరక పరిస్థితిని పసిగడతాయట. వారి అభిరుచికి తగ్గట్టుగా సుఖాన్ని అందిస్తాయట. ఇంకోసారి వచ్చినప్పుడు వారు అడకుండానే వారికి తగిన సుఖాన్ని అందించేందుకు వివరాలను కూడా సేకరించి సర్వర్లలో భద్రపరుస్తున్నాయి. సుఖాన్ని అందిస్తున్న క్రమంలో కొందరి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు కూడా సెక్స్ టాయ్స్ సేకరిస్తున్నాయట.
సుఖంతో పాటు ప్రమాదాలూ ఉన్నాయి..
ఏఐ ఆధారిత సెక్స్ టాయ్స్(Sextoys) తో ప్రమాదాలూ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని గోవాలో ఉన్న వీటితో ఒకవేళ ఎవరైనా మమేకం అయితే, వారి వ్యక్తిగత వివరాలు సైబర్ నేరస్తుల(Cyber Criminals) చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విటులు డబ్బు చెల్లించే క్రమంలో వీరి బ్యాంకు ఖాతాల వివరాలను కూడా సైబ్రోతల్స్ లో సేకరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ తరహా మోసాలకు సంబంధించిన నేరాలు వెలుగుచూడనప్పటికీ.. రానున్న రోజుల్లో ఈ తరహా నేరాలకు చోటు చేసుకుంటాయని.. అందుకే.. అలాంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
——————————