Kagaznagar
* స్టేషన్ రికార్డుల పరిశీలన
Kagaznagar| ఆకేరు న్యూస్, కాగజ్నగర్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ను కాళేశ్వరం జోన్-I డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలతో పాటు పోలీసుల పనితీరు, వివిధ రికార్డులను పరిశీలించారు. కేసుల నమోదు, దర్యాప్తు, సీసీటీఎన్ఎస్లో వివరాల అప్డేట్పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా సీఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ రైటర్లతో డీఐజీ మాట్లాడారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు, తరచుగా చోటుచేసుకునే నేరాలు, ఆయా గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై వివరాలు సేకరించారు.
మర్యాదగా వ్యవహరించాలి
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డీఐజీ సూచించారు. బాధితుల ఫిర్యాదులపై సకాలంలో స్పందిస్తూ పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అందించే పోలీస్ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లో ఉన్న వ్యక్తులు, నేర చరిత్ర కలిగిన వారిపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. వారి కదలికలను పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గణేష్ నిమజ్జనంపై సమీక్ష
ఈ నెల 25న జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లపై డీఐజీ సమీక్షించారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన సమస్యలు, సమస్యాత్మక ప్రాంతాలు, నిమజ్జన మార్గాలపై సీఐ, డీఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు సిబ్బంది మధ్య సమన్వయం ఉండేలా చూడాలని సూచించారు.
సీసీటీఎన్ఎస్పై ప్రత్యేక దృష్టి
కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీసీటీఎన్ఎస్ పనితీరును కూడా డీఐజీ పరిశీలించారు. కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి, డిజిటల్ రికార్డులను సక్రమంగా అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీలో కాగజ్నగర్ సబ్ డివిజన్ డీఎస్పీ, సీఐ ప్రేమ్ కుమార్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
