ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామపంచాయతీల నిర్వహణలో ఉత్తమ బహుమతి గెలుకున్న శంభునిపల్లి.
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
జాతీయ స్థాయిలో జరిగిన మహిళా ఆదర్శ గ్రామ పంచాయతీల నిర్వహణ ఉత్తమ పద్ధతుల వర్క్ షాప్ లో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి గ్రామపంచాయతీ ఉత్తమ బహుమతి గెల్చుకుందనీ కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోనీ పుణెలో నిర్వహించిన జాతీయ వేదిక పై వివిధ రాష్ట్రాలకు చెందిన విజయవంతమైన మోడల్ గ్రామాల విభాగంలో శంభునిపల్లి గ్రామపంచాయతీ డాక్యుమెంటరీ ప్రదర్శించారనీ ఆయన తెలిపారు.
మహిళా సాధికారత – గ్రామాల సాధికారత అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు, అధికారులు, నిపుణులు పాల్గొన్నారు. శంభునిపల్లి గ్రామానికి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు వరించడంతో మండల ప్రజలు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా 8 గ్రామ పంచాయతీలకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రాగ అందులో శంభునిపల్లి కి రావడం సంతోషంగా ఉందని గ్రామపంచాయతీ సెక్రెటరీ సాహితీ రెడ్డిని ఎంపీడీవో అభినందించారు.


