
ఆకేరు న్యూస్ ములుగుః జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యూఢిల్లీలోని మానవ హక్కులపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఏడాది షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నది, ఇందులో భాగంగా ఈసారి 2025 సంవత్సరానికి గాను 11వ ఎడిషన్ షార్ట్ ఫిల్మ్ పోటీలు ప్రకటించబడినట్లు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.ఈ పోటీలకు అన్ని వయస్సుల వారు పాల్గొనవచ్చునని, మానవ హక్కులపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ల పోటీలలో పాల్గొనే వారు ఆగస్టు 31, 2025 లోగా nhrcshortfilm@gmail.comకు దరఖాస్తు తో పాటు రూపొందించిన 3 నుండి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ పంపించాల్సి ఉంటుందని అన్నారు.విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతి రెండు లక్షలు, ద్వితీయ బహుమతి లక్ష యాభై తృతీయ బహుమతి లక్ష రూపాయలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.ములుగు జిల్లా ప్రజలు, విద్యార్థులు, కళాకారులు, ప్రజలు, ఎన్.జి.ఓలు, గ్రామ పంచాయతీలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
………………………………………………….