Siddipet Women Workers
* మహిళా కార్మికుల ఆవేదన
* సింప్లీఫ్రెష్లో కలకలం
ఆకేరు న్యూస్, సిద్దిపేట: చేర్యాల మండలం అర్జునపట్లలోని సింప్లీఫ్రెష్ కంపెనీ వద్ద కార్మికులు వేతనాల పెంపు కోరుతూ ఆందోళన చేపట్టారు. రోజుకు రూ.400 మాత్రమే వేతనం ఇస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ సందర్భంగా మహిళా కార్మికులు సూపర్వైజర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. పని సమయంలో మూత్రవిసర్జనకు వెళ్లకుండా “డైపర్లు వేసుకోమన్నాడు” అని పోలీసుల ఎదుట ఆరోపించారు. అలాగే తనతో సాన్నిహిత్యంగా ఉంటే వేతనాలు పెంచుతానని చెప్పేవాడని పేర్కొన్నారు.
* మహిళలపై వివక్ష
తమతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది మహిళా కార్మికుల పట్ల సూపర్వైజర్ వివక్షతో వ్యవహరిస్తున్నాడని కూడా కార్మికులు ఆరోపించారు. పని ప్రదేశంలో ప్రాంతం, భాష లేదా ఇతర కారణాలతో వివక్ష చూపుతున్నారా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.
* ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు?
మహిళా కార్మికులు తమ సమస్యలను పోలీసులకు వివరించినప్పటికీ, అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని సమాచారం. ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు పోతాయనే భయం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
