Varun - Lavanya Son Vayuv
* కుమారుడికి వరుణ్–లావణ్య బర్త్‌డే విషెస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతుల కుమారుడు వాయువ్ తొలి పుట్టినరోజును జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా తొలిసారి తమ కుమారుడి ముఖాన్ని అభిమానులకు చూపిస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ కుమారుడిపై ప్రేమను వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్టులు పెట్టారు.
* వరుణ్ తేజ్ ఏమన్నారంటే..
నా ప్రియమైన బాబూ.. నా ప్రపంచాన్ని సాధ్యమైనంత అందమైన రీతిలో మార్చేశావు. నిన్ను తొలిసారి చూడకముందే నీతో ప్రేమలో పడిపోయాను. నీ తండ్రిగా ఉండటం నా జీవితంలో అత్యంత అందమైన భాగం. హ్యాపీ ఫస్ట్ బర్త్‌డే వాయువ్. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ వరుణ్ తేజ్ భావోద్వేగంగా రాశారు.
* లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్
లావణ్య కూడా తన కుమారుడికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపారు. “నన్ను నీ తల్లిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. నువ్వు మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత ప్రేమకు ఇంత కొత్త రూపం ఉంటుందని తెలుసుకున్నాను. నీ చిన్నచిన్న నవ్వులు, బుల్లి చేతులు, కౌగిలింతలతో మా ఇంటి నిండా ఆనందాన్ని నింపావు. నువ్వు నా శరీరం బయట నడుస్తున్న నా హృదయం. నా జీవితంలో లభించిన అతిపెద్ద వరం. నువ్వే మా ప్రపంచం వాయువ్. హ్యాపీ ఫస్ట్ బర్త్‌డే నా బేబీ!” అంటూ లావణ్య భావోద్వేగంగా పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు వాయువ్ ముఖాన్ని పబ్లిక్‌గా చూపించని వరుణ్–లావణ్య దంపతులు.. ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా తొలిసారి అతడి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
