Telangana Voter SMS Status
* ఓటరు సవరణ ప్రక్రియ (SIR) స్థితి తెలుసుకోవాలా ?
* SMS ద్వారా ఓటరు నమోదు (SIR) వెసులుబాటు
– CEO తెలంగాణ
ఆకేరు న్యూస్, కమలాపూర్:
తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా, ఓటర్లకు సహాయపడేందుకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) ఒక అత్యంత సులభమైన ఎస్ఎంఎస్ (SMS) సేవను అందుబాటులోకి తెచ్చారు. ఈ సౌకర్యం ద్వారా ప్రతి ఓటరు స్మార్ట్ఫోన్ లేదా ఇంటర్నెట్ అవసరం లేకుండానే, తమ సాధారణ మొబైల్ ఫోన్ నుంచి కూడా ఒక ఎస్ఎంఎస్ పంపి తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తక్షణమే చెక్ చేసుకోవచ్చు.
*మెసేజ్ ఎలా పంపాలి ?
దీని కోసం మీ ఫోన్ మెసేజ్ బాక్స్ నుంచి, ECI <space> మీ ఓటరు ఐడీ (EPIC) నంబరు అని టైప్ చేసి (ఉదాహరణకు: ECI UTQ0777245), 1950 అనే నంబరుకు పంపాల్సి ఉంటుంది.
మెసేజ్ పంపిన కొద్ది నిమిషాల్లోనే ఎన్నికల కమిషన్ నుంచి రిప్లై ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో మీ పేరు, EPIC వివరాలు ఉంటే మీ ఓటు విజయవంతంగా నమోదైనట్లే.
ఒకవేళ ఎలాంటి వివరాలు రాకపోతే వెంటనే మీ ప్రాంతీయ బూత్ లెవల్ అధికారి (BLO)ని సంప్రదించి వివరాలు సరిచూసుకోవాలి. రాబోయే ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రతి పౌరుడూ ముందస్తుగానే ఈ SMS సౌకర్యం ద్వారా తమ ఓటు నమోదు స్థితిని ధృవీకరించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
