ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఏర్పాటైన సిట్ విచారణను వేగవంతం చేసింది. హింసాత్మక ఘటనకు కారకులెవరు? సహకరించిన అధికారులు ఎవరు? అనేది నిగ్గు తేల్చడానికి 13 సభ్యులతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఈ సిట్ పని చేయనుంది. సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత పని చేయనున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఇన్ స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్ స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్ సభ్యులుగా నియామకమయ్యారు. ఈమేరకు వినీత్ బ్రిజ్ లాల్.. తాజాగా ఏపీ డీజీపీని కలిశారు. అలాగే.. హింస జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో విచారణ చేపడుతున్నారు. అలాగే.. ఆయా ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ ఐఆర్ లను పరిశీలించి, తగు చర్యలు చేపడతామని వినీత్ బ్రిజ్ తెలిపారు. ఎప్పటికప్పుడు నివేదికలను డీజీపీకి అందజేస్తామన్నారు.
———————-