Smriti Mandhana Captain
* స్మృతి మంధానకు కీలక బాధ్యతలు!
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. దీంతో వైట్-బాల్ క్రికెట్లో భారత జట్టుకు మంధాన కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టనుంది. జింబాబ్వేతో జరిగే స్వదేశీ సిరీస్ నుంచే స్మృతి మంధాన కెప్టెన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. టీ20లకు షెఫాలీ వర్మ, వన్డేలకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం రెండు ఫార్మాట్లలోనూ ప్లేయర్‌గా కొనసాగనుంది.
* మంధానకు కెప్టెన్సీలో అనుభవం
2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన స్మృతి మంధాన ఇప్పటికే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఆమె 18 టీ20లు, 4 వన్డేల్లో జట్టుకు సారథ్యం వహించింది. మంధాన నాయకత్వంలో భారత్ ఆడిన నాలుగు వన్డేలలోనూ విజయం సాధించింది. టీ20ల్లో 18 మ్యాచ్‌లకు 11 విజయాలు నమోదు చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 2024, 2026లో ఛాంపియన్‌గా నిలిపిన ఘనత కూడా ఆమెకు ఉంది.
* “ఇది నాకు ప్రత్యేక గౌరవం”
కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప గౌరవమని, ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం మరింత ప్రత్యేకమని పేర్కొంది.
తనపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, సెలక్టర్లు, సహచర క్రీడాకారిణులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు అందించిన సేవలను గౌరవిస్తున్నానని పేర్కొంది. కొత్త బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపింది.
Honoured. Grateful. Ready. 💙
@mandhana_smriti reflects on the immense pride of becoming #TeamIndia Captain and carrying the legacy forward 🫡🇮🇳 https://t.co/qFooagUeJr
— BCCI Women (@BCCIWomen) October 6, 2026
* జింబాబ్వే సిరీస్‌తో కొత్త బాధ్యతలు
జింబాబ్వేతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
* టీ20లు: అక్టోబర్ 16, 18, 20 – రాయ్‌పూర్
* వన్డేలు: అక్టోబర్ 23, 25, 28 – వడోదరా
* టీ20 వైస్ కెప్టెన్: షెఫాలీ వర్మ
* వన్డే వైస్ కెప్టెన్: దీప్తి శర్మ
* నికీ ప్రసాద్‌కు తొలిసారి చోటు
జింబాబ్వే సిరీస్ కోసం ప్రకటించిన టీ20 జట్టులో 20 ఏళ్ల కర్ణాటక బ్యాటర్ నికీ ప్రసాద్‌కు తొలిసారి చోటు లభించింది. ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన సిరీస్‌లో ఆమె ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అనుష్క శర్మ కూడా జట్టులోకి తిరిగి వచ్చింది. గాయం నుంచి కోలుకుంటున్న జెమిమా రోడ్రిగ్స్‌తో పాటు రేణుకా సింగ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్‌లకు టీ20 జట్టులో చోటు దక్కలేదు.
స్మృతి మంధాన నియామకంపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా హర్షం వ్యక్తం చేశారు. జట్టును విజయపథంలో నడిపించే సామర్థ్యం, అనుభవం మంధానకు ఉన్నాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
🚨 News 🚨
Here’s #TeamIndia women’s T20I and ODI squads under Smriti Mandhana’s first series as full-time captain 👏
More Details ▶️ https://t.co/jW53GaoweG
#INDvZIM | @mflone_ | @mandhana_smriti https://t.co/4zOhFgDO7h
— BCCI Women (@BCCIWomen) October 6, 2026

Please tell us what is wrong. Your report will be sent to the website team.

