
* సౌత్ ఎండ్ నుంచి టేకాఫ్ అయి కుప్పకూలిన విమానం
* విమాన సర్వీసులకు మూసివేసిన ఎయిర్ పోర్ట్ అధికారులు
ఆకేరున్యూస్ డెస్క్ ఃఆదివారం రాత్రి సౌత్ ఎండ్ విమానాశ్రయంనుంచి నెదర్లాండ్స్ కు బయలు దేరిన బీ. 200 సూపర్ కింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలి ప్రమాదానికి గురైంది. విమానం కుప్పకూలడంతో ఒక్క సారిగా దట్టమైన పొగమంటలు వ్యాపించాయి. క్రొవేషియా నుంచి లండన్ చేరుకున్న ఈ విమానం లండన్ సౌత్ ఎండ్ విమానాశ్రయం నుంచి తిరిగి నెదర్లాండ్స్ లోని లెలిస్టాడ్ కు బయలు దేరింది. విమానంలో 13 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు విమానసిబ్బంది ఉన్నట్లు సమాచారం.. అయితే విమాన ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. విమాన ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన జాన్ జాన్సన్ అనే వ్యక్తి ప్రమాదం జగినప్పుడు ఒక్కసారే విమానంలో నుంచి పెద్ద పెద్ద మంటలు బయటపడ్డాయని చెప్తున్నాడు. ఆ సమయంలో అతడు తన భార్యా పిల్లలతో విమానాశ్రయంలో ఉన్నారు.
……………………………………………….