– బండి సంజయ్ ఆదేశాలతో ఉప్పల్ ఆర్ఓబి పనులను సత్వరం పూర్తి చేసేలా చర్యలు
– ఆర్ఓబి నిర్మాణానికి 6 గంటల పాటు లైన్ బ్లాక్ ఇస్తూ రైల్వే శాఖ నిర్ణయం
– వారం రోజుల్లో ఆర్ఓబి నిర్మాణం కోసం చెన్నై నుంచి రానున్న క్రేన్లు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ను ద.మ. రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గుప్తా బుధవారం సందర్శించారు. రైల్వేస్టేషన్లో సమస్యలపై , ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై గుప్త సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆర్ఓబీ పనుల్లో కీలకమైన గడ్డర్లను రైల్వే ట్రాక్ పై అమర్చటానికి రైళ్ల రాకపోకలను నిలపాల్సి ఉన్నందున ,పనులు చేసే రోజు దాదాపు 6 గంటల పాటు లైన్ బ్లాక్ ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే మంగళవారం రోజున కీలక నిర్ణయం తీసుకుందని గుప్త తెలిపారు. ఉప్పల్ ఆర్ఓబి పనుల్లో కీలకమైన గడ్డర్లను సురక్షితంగా పైకి లేపి బిగించేందుకు వీలుగా వారం రోజుల్లోగా అధిక సామర్థ్యం కలిగిన క్రేన్లను చెన్నై నుంచి తెప్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్ఓబి నిర్మాణంలో ప్రధానంగా గుత్తేదారిపై సిబిఐ కేసు కారణంగా ఆలస్యమైందని, మిగతా పనుల ఆలస్యానికి గల కారణాలను గుర్తించడం జరిగిందని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాలతో ఆర్ఓబి పనులు వేగవంతం పూర్తి చేయడానికి రైల్వే శాఖ తగిన చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం బండి సంజయ్ కృతనిశ్చయంతో ఉన్నారనీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు, రైల్వే స్టేషన్ ని ఆధునికరించడం కొరకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గుప్తాకు గంగాడి కృష్ణారెడ్డి , బీజేపీ శ్రేణులు వినతి పత్రం అందించారు. త్వరలోనే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునికరించడానికి బండి సంజయ్ కృతనిశ్చయంతో ఉన్నారని కృష్ణారెడ్డి మీడియాతో అన్నారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, జిల్లా నాయకులు తోట సురేష్ , తుమ్మ శోభన్ బాబు,బండి కోటేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్,పుల్లా అద్భుతరావు,చెట్టి సుందరయ్య, దండబోయిన శ్రీనివాస్, పసునూటి రాణా ప్రతాప్, గుర్రం సురేష్, మేడిపల్లి రాజు, చిర్స్ లచ్చన, రాజేందర్,రావుల ఆకాష్,చింతల రంజిత్ లు పాల్గొన్నారు.

………………………………………………….
