
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, లక్ష్యంతో ఉన్నత చదువులు చదవాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు.
గురువారం జిల్లా కేంద్రం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలల ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో లో చదువుతున్న పదవ తరగతి, క్లాసు రూమ్ లను పరిశీలించి విద్యార్థినిలతో తెలుగు, ఇంగ్లీష్ , హింది సబ్జెక్టుల వారీగా వివరాలు అడిగి తెలుసుకొని, తెలుగు, ఇంగ్లీష్ పై పట్టు ఉండాలని, విద్యార్థుల తో తెలుగు చదివించారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని వివరించారు.. విద్యార్థులు మంచిగా చదువుకొని పోటీ తత్వంలో ముందుకు వెళ్లాలని, తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వర్షాకాలం కావడంతో పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో తరగతి గదులను పరిశీలించారు. విద్యాబోధన, డిజిటల్ క్లాసు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. 3 వ తరగతి విద్యార్థిని డిజిటల్ స్క్రీన్ లో ఇంగ్లీష్ పదాలను చదువుతుండగా కలెక్టర్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………