
ఆకేరు న్యూస్, ములుగు: ఏజెన్సీ ప్రాంతంలోని ములుగు జిల్లాలో గల భూముల గ్రామాలలో సీజనల్ వ్యాధుల నియంత్ర ణ ఉమ్మడి వరంగల్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ వాసం వెంకటేశ్వర్లు శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు ఇందులో భాగంగా ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామం లోని అంగన్వాడి సెంటర్, ప్రాథమిక పాఠశాల, గ్రామం లో పారిశుద్ద పనులను పరిశీలించారు. అనంతరం కన్నాయిగూడెం చిన్నబోయినపల్లి ఉప కేంద్రాలను సందర్శించి ఆ గ్రామాలలో డెంగు వ్యాధి బారిన పడిన ఇంటిని సందర్శించి బాలుని ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు .బాలుని తండ్రితో మాట్లాడుతూ బాలుడు రక్తహీనతతో ఉన్నాడని అతనికి పోషకాహారాన్ని ఇవ్వాలని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, జ్వరము వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్సను తీసుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. అంగన్వాడి సెంటర్ ను, ప్రాథమిక పాఠశాలను సందర్శించి పిల్లల ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు.
సామాజిక ఆరోగ్య కేంద్రం సందర్శన
ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బందినీ ఉద్దేశించి మాట్లాడుతూ, గిరిజన ప్రాంత ప్రజలకు వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగ్యూ వ్యాధులపట్ల అవగాహనను పెంపొందించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఈ రాబోయే రెండు మాసాల వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
సామాజిక ఆరోగ్య కేంద్రం , ఫీవర్ వార్డ్‌లో ,చికిత్స పొందుతున్న జ్వర బాధితుల ఆరోగ్య పరిస్థితులను మరియు వారి కేస్ షీట్ పరిశీలించి, రోగులకు గల ప్లెట్లెట్స్ సంఖ్యను అడిగి తెలుసుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత డాక్టర్లకు, సిబ్బందికి తెలియజేశారు. ఐ సి టి సి సెంటర్ ను సందర్శించి, హెచ్ఐవి టెస్టుల వివరాలను అడిగి తెలుసుకుని హెచ్ఐవి బాధితులకు మందులను పంపిణీ చేసి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగించాలని సిబ్బందికి వివరించారు. రక్త నిధి సెంటర్ ను ప్రసూతి వార్డును సందర్శించి, తల్లులను వారి పిల్లల ఆరోగ్యాన్ని వారికి అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు, డిసిహెచ్ ములుగు డాక్టర్ జగదీష్ , సూపర్నెంట్ డాక్టర్ సురేష్, వివిధ విభాగాల అధికారులు డాక్టర్స్ మరియు ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………….