Dhanush Political Entry
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే చర్చ ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఆయన అభిమాన సంఘాల కార్యకలాపాలు, సామాజిక సేవా కార్యక్రమాలు మరింత చురుగ్గా మారడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా అభిమానులు కేవలం సినిమా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలని ధనుష్ పిలుపునివ్వడం రాజకీయ ప్రవేశంపై ఆసక్తిని పెంచింది.
* అధికారిక ప్రకటన రాలేదు..
ఇటీవల ధనుష్ అభిమాన సంఘం జెండాను ఆవిష్కరించడం, వివిధ ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం కూడా చర్చకు దారితీసింది. అయితే ఇప్పటివరకు ధనుష్ స్వయంగా రాజకీయ పార్టీ స్థాపన లేదా రాజకీయాల్లోకి అధికారికంగా వస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.
* ఇప్పటికే విజయ్ .. ఇప్పుడు ధనుష్
ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమ నుంచి విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తనదైన రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ధనుష్ పేరు తెరపైకి రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ధనుష్‌కు ఉన్న భారీ అభిమానగణం, సామాజిక కార్యక్రమాలపై విస్తృతం చేస్తున్నారు. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఆయన విధానం, సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై ఆయన వైఖరి ఎలా ఉంటుందన్నదే కీలకం కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
