
* ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరున్యూస్,హనుమకొండ: అంతర్జాతీయ ప్రమాణాలతో హనుమకొండలో స్పోర్ట్ష్ స్కూల్ ఏర్పాటు అవుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లాలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తరగతుల వసతులను శుక్రవారం ఆయన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి ,జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్,GWMC కమిషనర్ శ్రీమతి చౌహాన్ బాజ్ పాయ్లతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని హకీంపేట తరహాలో హనుమకొండలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్ష్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.మొదటి దఫా క్రీడా పాఠశాల తరగతుల ఏర్పాటుకు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు, వసతులు పట్ల కచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేస్తున్నామని తెలిపారు.ఆయా శాఖల అధికారులతో కలిసి స్టేడియంలో ఉన్న బాలుర,బాలికల వసతి గృహాలను పరిశీలించారు.
………………………………………………..