Hindu unity for India
* హిందువులు ఐక్యమై.. భారత దేశాన్ని విశ్వ గురువు చేయాలి
.. శ్రీ ధరానంద భారతి స్వామి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
హిందువుల ఐక్యతతో జాతి భద్రత, తద్వారా హిందూ సమాజం చైతన్యవంతమై భారత దేశాన్ని విశ్వ గురువుగా నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైదిక ధ్యానయోగ ఆశ్రమ నిర్వాహకులు శ్రీ రధానంద భారతీ స్వామి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యుడు, భూమి సీతారామ చంద్రులు మనకు ఆదర్శమన్నారు. ఆదర్శప్రాయుడు శ్రీరాముడి అడుగుజాడల్లో ఆయన అనుసరించిన విధానాన్ని ఆచరిస్తూ భవిష్యత్ తరాలకు చక్కని సమాజాన్ని అందించాలని అందుకు అందరూ హిందూ ధర్మ వ్యాప్తికి కృషి చేయాలన్నారు. అంతకుముందు నవత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ఉమ్మడి కుటుంబాలు, పిల్లల భవిష్యత్తు, మంచి సమాజ నిర్మాణంలో మన పాత్ర అనే అంశాలను వివరించిన తీరు ఆహుతులను ఆకట్టుకుంది. స్టేషన్ ఘన్ పూర్ హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు పాలకుర్తి సోమశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, సత్యం జి, కౌన్సిలర్లు సంగీత రమేష్, బొల్లు లక్ష్మి, రాజేష్, బూర్ల రాజేశ్వర్, సమ్మేళన బాధ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యాలు సబికులను ఆకట్టుకున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
