Srinivas Goud arrest sparks BRS protest
* పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్ నేతల నిరసన
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు వెళుతున్న మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయన అరెస్టును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు డివిజన్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ జై తెలంగాణ, ఆర్టీసీ డ్రైవర్ డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాలి, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా ఈ సీఎం అంటూ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. స్టేషన్ ముందు బైఠాయించిన వారిలో కౌన్సిలర్లు అనిల్, రాజేష్, రాజేశ్వర్, మధు నాయకులు పార్శి రంగారావు, కేశిరెడ్డి రాకేష్ రెడ్డి, మారపల్లి ప్రసాద్, నస్కల్ స్వామి, సురేష్ కుమార్ చిట్టిబాబు, గుండా మల్లేష్, చల్లా చందర్ రెడ్డి, మునిగల రాజు, మాచర్ల గణేష్, ట్యాంక్ హీర సింగ్ బూర్ల విష్ణు తోపాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక దశలో టిఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అటు పోలీసులు ఇటు నాయకులు మధ్య వాగ్వివాదం జరిగింది.

