ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామిదేవస్థానములో శనివారం స్వామి వారి వార కళ్యాణము వేదమంత్రోచరణలతో వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల, పట్టణాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో బి. లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మోహన్ అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ధర్మసాగర్ మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన తౌటిరెడ్డి తార- పెద్దిరెడ్డి, అఖిల సౌజన్యంతో అన్న ప్రసాద వితరణ చేశారు.
……………………………………..
