ASHA workers salary demand
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
వేతనాలు చెల్లింపులో ఆలస్యం, పెంపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం విడనాడి వెంటనే వేతనాలు పెంచి, చెల్లించాలని ఆశ వర్కర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెం ఆశ వర్కర్లు మారపాక సుధ, ఎలకంటి సంధ్య, ఎర్రబెల్లి రేణుక లు మంగళవారం స్థానిక సర్పంచికి వినతిపత్రం అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ముసలి, గర్భని స్త్రీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే మెడిసిన్స్ సకాలంలో అందిస్తూ వారి యోగక్షేమాలను చూస్తున్న మాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు చెల్లింపులు ఆలస్యం, జీతాల పెంచడంలో నిర్లక్ష్యo చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరిచి ఆశ వర్కర్లకు జీతాలు పెంచాలని, పెంచిన జీవితాలను వెంటనే చెల్లించాలని సర్పంచ్ మల్లం రవీందర్, గ్రామ కార్యదర్శి మమత ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
