Revanth Reddy
- కేయూ స్వర్ణోత్సవాలకు హాజరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ మొదటి వారంలో వరంగల్లో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు నగర అభివృద్ధికి సంబంధించిన కీలక పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే ఆహ్వానం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరంగల్ పర్యటనకు ఆహ్వానించారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల వసంతోత్సవాలతో పాటు కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. ఈ ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
సీఎం పర్యటనలో భాగంగా వరంగల్ నగరంలో అండర్ డ్రైనేజ్తో పాటు పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలుస్తోంది. మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం సమీక్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పర్యటన తేదీ, కార్యక్రమాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
