Venugopala Swamy Kalyanam Ippagudem
* కమనీయం.. రమణీయం శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
కమనీయం.. కడు రమణీయం శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో గురువారం శ్రీ వేణు గోపాలస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. రుక్మిణి, సత్యభామలతో మురళీధరుడు వేణుగోపాల స్వామికి కల్యాణ మహోత్సవం కనుల విందుగా జరిగింది. పండితుల వేదమంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య కళ్యాణ మహోత్సవం శాస్త్రోప్తంగా జరిగింది. పొట్లపల్లి లక్ష్మారావు పేర వారి కూతుర్లు రూ.20 వేలు, కొల్లూరి ప్రకాష్ రూ.25 వేలతో గుడికి రంగుల వేయించడం జరిగింది. ఎంతో వైభవంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో సర్పంచ్ మందపురం రాణి-అనిల్, ఉపసర్పంచ్ లింగనబోయిన రాజు, శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయ ఉత్సవ కమిటి సభ్యులు జూలూకుంట్ల ప్రకాష్ రెడ్డి దంపతులు, దామెర నాగలక్ష్మి-వేణు, ఆరూరి రవళి -జయప్రకాశ్, సట్ల వెంకటరమణ, గోడిశాల జయశ్రీ-రామచంద్రం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ మధునాపురం (ఇప్పగూడెం)వేణుగోపాలస్వామి జాతర మహోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగు తున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
