Udutha Ravinder farmer leader
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజి గూడెంకి చెందిన ‘ఉడుత రవీందర్’ తెలంగాణ రైతు సంఘం (అఖిల భారత కిసాన్ సభ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (అఖిలభారత కిషన్ సభ ) 3వ రాష్ట్ర మహాసభలు ఈనెల 23, 24, 25 తేదీలలో భద్రాది కొత్తగూడెంలో జరిగాయి. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (జిఎంపిఎస్) రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న ఉడుత రవీందర్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు తీసుకున్నాడు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో వ్యవసాయo, రానున్న రోజులలో సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం(జిఎంపిఎస్) గొల్లకురుమలు వ్యవసాయ అనుబంధంగా గొర్రెల వృత్తిని నమ్ముకున్న అభివృద్ధి కావడం లేదు అందుకే గొర్రెల కాపరి వృత్తి తో పాటు వ్యవసాయంలో కూడా గొల్ల కురుమలు ముందుండాలని గొర్రెల వృత్తితోపాటు వ్యవసాయం మీద అభివృద్ధి సాధించేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఉడుత రవీందర్ సిపిఎం అనుబంధం సంఘాలు డివైఎఫ్ఐ, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం(జిఎంపిఎస్) రాష్ట్ర అధ్యక్షులుగా, ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా, సిపిఎం పార్టీ రాష్ట్ర కమీటి సభ్యులుగా, నిర్మల్ జిల్లా ఇంచార్జిగా పూర్తి కాలం కార్యకర్తగా పని చేస్తూన్నారు. సిపిఎం అనుబంధ సంఘాల బాధ్యతల నిర్వహణలో గ్రామ స్థాయి నుండి రాష్ట్రస్థాయికి ఎదిగిన రవీందర్ కు కృష్ణాజి గూడెం తో పాటు వివిధ గ్రామాల పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
