Fertilizer dealers strike Telangana
* డీలర్లపై కంపెనీల వేధింపులు ఆపాలి
-డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు
ఆకేరు న్యూస్ ,హైదరాబాద్: ఎరువులు, వితన కంపెనీల ఏకపక్ష విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎరువులు, విత్తనాలు మరియు పురుగు మందుల దుకాణాలను రేపు మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.
శనివారం హైదరాబాద్‌లోని బాబూఖాన్ ఎస్టేట్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు: ఎరువుల సరఫరా సమయంలో కంపెనీలు అనవసరమైన ఇతర ఉత్పత్తులను (లింక్డ్ ప్రోడక్ట్స్) డీలర్లపై రుద్దుతున్నాయని, దీనివల్ల డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగుర్ల పేర్కొన్నారు. ఎరువుల సరఫరాపై తక్షణమే ఎఫ్వోఎల్ (Free on Lorry/Rail)విధానాన్ని అమలు చేసి, ఎటువంటి అదనపు నిబంధనలు లేకుండా ఎరువులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
* కంపెనీల వేధింపులు ఎక్కువయినాయి
ఉత్పత్తిదారుల కొత్త పాలసీలు క్షేత్రస్థాయిలో ఉన్న డీలర్ల మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయని నాగుర్ల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం మరియు కంపెనీల దృష్టికి తీసుకెళ్లాలని వెంకటేశ్వర్లు కోరారు. రైతులకు సేవ చేస్తున్న డీలర్ల సంక్షేమాన్ని విస్మరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామడుగు మనోహరరావు, కోశాధికారి సిద్ది నాగరాజు సాయికృష్ణ, రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, జేకేఎస్ గోపయ్య, పున్నమి రాజేందర్ రెడ్డి, పరకాల మండల అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు, ప్రకాష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
