Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: వార్డులో నెలకొన్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు 8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్ తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్‌లో బుధవారం మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్, కమిషనర్ రాధాకృష్ణతో కలిసి వార్డులో సమస్యలను పరిశీలించారు.
పలు సమస్యలపై పరిశీలన
చాగల్లోని మంచినీటి బావికి కప్పు ఏర్పాటు చేయాలని, మినీ సిస్టం చుట్టూ సీసీ రోడ్డు నిర్మించి నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వీధుల్లో సంచరిస్తున్న పందులను నియంత్రించాలని, శిథిలావస్థకు చేరిన పశువుల ఆసుపత్రి భవనాన్ని తొలగించాలని కోరారు.
ఏఈకి కమిషనర్ ఆదేశాలు
మంచినీటి బావిపై కప్పు ఏర్పాటు, మినీ సిస్టం వద్ద సీసీ నిర్మాణానికి సంబంధించి చర్యలు చేపట్టాలని కమిషనర్ ఏఈని ఆదేశించినట్లు రాజేష్ తెలిపారు. పందుల సమస్యపై కూడా కమిషనర్ స్పందించారు. పందుల యజమానులను పిలిపించి వాటిని వార్డుల్లో తిరగకుండా చూడాలని, నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
వార్డు సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కారానికి అధికారులు సానుకూలంగా స్పందించడం పట్ల కౌన్సిలర్ రాజేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో కౌన్సిలర్లు పొన్న రాజేష్, బాలగాని అనిల్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్, వినయ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
