
* బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం
* బీఆర్ ఎస్ చేసిన చట్టం గుదిబండగా మారింది
* జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే కన్నెత్తి చూడలేదు
* సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు
* అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లు (BC RESERVATION BILL) ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ( R EVANTH REDDY) అన్నారు. అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉన్నదని క్లారిటీ ఇచ్చారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ (RAHUL GANDHI)ఆదేశాల మేరకు సోనియా గాంధీ (SONIA GANDHI) ఆశీస్త్సులతోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చామని రేవంత్ అన్నారు. రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఐదు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని అపాయింట్మెంట్ కోరామని ప్రధాని తమకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని సీఎం తెలిపారు, చివరికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ (JANTHAR MANTHAR) వద్ద ధర్నా చేస్తే 100 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మద్దతిచ్చారన్నారు. రాజ్యసభలో ఉన్న బీఆర్ ఎస్ ఎంపీలు మాత్రం జంతర్ మంతర్ వైపు కన్నెత్తి చూడలేదన్నారు.బలహీన వర్గాలకు న్యాయం చేయాలని తాము ప్రయత్నిస్తోంటే బీఆర్ ఎస్ పార్టీ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.
కేసీఆర్ లాబీయంగ్ తో బిల్లు పెండింగ్
ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించి అర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపించామన్నరు. బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టరూపం కాకుండా కేసీఆర్(KCR) తెరవెనుక తతంతంగ నడిపించారని రేవంత్ అన్నారు. గవర్నర్, గత సీఎంల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే బిల్లులు ఆగాయని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలైతే తాను సంతోషంగా ఉంటానని మాత్రమే బీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(GANGULA KAMALAKAR) అన్నారని, తమ నాయకులైన కేసీఆర్, కేటీఆర్ ఈ బిల్లు అమలైతే సంతోషంగా ఉండరని చెప్పకనే చెప్పారన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలుపై ఆరోపణలు చేయడం మానుకొని, సూచనలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి గంగుల కమలాకర్ను కోరారు. ఎలాంటి సవరణలు లేకుండా బిల్లును ఆమోదించాలని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కృషి చేస్తోందన్నారు. వీలైతే సహకరించండి, లేదంటే మళ్లీ ప్రజలు మీకు సరైన గుణపాఠం చెబుతారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
…………………………………..