
* ప్రొఫెసర్ ప్రంభంజన్ కుమార్ యాదవ్ కన్నుమూత
* దళిత బహుజనుల హక్కుల కోసం కృషి
* గొల్లకురుమల జీవితాలపై అనేక పరిశోధనలు
*తెలంగాణ సాదన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా
ఆకేరు న్యూస్ హనుమకొండ ః నమ్మిన సిద్దాంతం కోసం జీవితాన్ని త్యాగం చేసిన నిరంతర పోరాట యోధుడు డాక్టర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రభంజన్ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. జనగామ జిల్లా గూడూరులో జన్మించిన ప్రభంజన్ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాక హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో పీహెచ్ డీ పట్టా తీసుకున్నారు. కొంత కాలం ఈనాడులో జర్నలిస్ట్‌గా పనిచేశారు. జర్నలిస్టుల హక్కుల కోసం ఈనాడు యాజమాన్యంతో పోరాటం చేశారు. ఈనాడు చరిత్ర లో మొట్టమొదట హక్కుల కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి ప్రభంజన్. దళిత బహుజనుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు. దళిత బహుజనుల చరిత్ర మీద, అనేక పుస్తకాలు రాశారు. దళిత, బహుజనల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. గద్దర్,బెల్లి లలిత ప్రొఫెసర్ జయశంకర్ తో కలిసి అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. కుల వృత్తులపై స్టడీ చేశారు. సాంప్రదాయక కళలను కాపాడేందుకు విశేష కృషి చేశారు. జర్నలిజంపై అనేక పుస్తకాలు రాశారు. అనేక సమావేశాలు,సెమినార్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గొల్లకురుమల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు. గొల్లకురుమ జీవితాలపై అనేక పుస్తుకాలు రాశారు. బ్రాహ్మణీయ భావజాలాన్ని,మనువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
తెలంగాణ కోసం ఉద్యోగానికి రాజీనామా
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో చేరిన ప్రభంజన్ తెలంగాణ ఉద్యమం
ఉధృతంగా ఉన్న సమయంలో ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ అధికారిగా
ఢిల్లీలో ఉద్యోగం చేస్తూనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జేఏసీ ఢిల్లీలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తాను చేస్తున్న ఐఏ ఎస్ క్యాడర్ లాంటి ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజం విభాగానికి అధిపతిగా చేరారు. రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యలో జర్నలిజం కోర్సు ప్రవేశ పెట్టిన తరువాత ఆ విభాగానికి మొట్టమొదటి కో ఆర్డినేటర్ గా పనిచేశారు.
రాజీలేని పోరాటం
తాను నమ్మిన సిద్దాంతం కోసం రాజీలేని పోరాటం చేశారు. తన జీవితాన్ని మొత్తం దళిత బహుజన హక్కుల సాధన కోసం కృషి చేశారు. దళిత బహుజనులు ముఖ్యంగా గొల్లకురుమల చరిత్రపై అనేక పరిశోధనలు చేశారు. ముక్కుసూటిగా వ్యవహరించడం ప్రభంజన్ తత్వం. తాను అనుకున్నది చేయడమే ఆయన నైజం. తెలంగాణ సాధన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికే రాజీనామా చేశారు.
………………………………………