* వైద్యురాలిపై లైంగికదాడి ఘటనపై కదంతొక్కిన విద్యార్థులు
* సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్
* కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత
* భాష్పవాయు ప్రయోగం.. గాల్లోకి కాల్పులు
* లాఠీచార్జీలో పలువురు విద్యార్థులకు గాయాలు
ఆకేరున్యూస్ డెస్క్ : కోల్‌కతా(KOLKATA) లో జూనియర్ డాక్టర్‌పై లైంగికదాడి, హత్య (Jr Dr.. RAPE AND MURDER) ఘటనపై వేల సంఖ్యలో విద్యార్థి సంఘాలు (STUDENTS UNIONS) భారీ స్థాయిలో మంగళవారం నిరసన ప్రదర్శనలు తలపెట్టాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (WEST BENGAL CHIEF MINISTER MAMATA BENARGY) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హౌరా బ్రిడ్జి (HOWRA BRIDGE) పై ధర్నా చేపట్టారు. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. వేల సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి (POLICE LOTTYCHARGE)చేసినా, టియర్ గ్యాస్(TIYAR GAS) ప్రయోగించినా వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ.. నలుదిక్కుల నుంచి తరలివస్తూ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ప్రతి 15 నిమిషాలకు ఓ సారి భాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో విద్యార్థులు వెనకడుగు వేయకుండా సీఎం పదవికి మమత రాజీనామా (RISIGNATION DEMANT FOR CHIEF MINISTER OF WEST BENGAL) చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య అనేక చోట్ల ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కూడా కాల్పులు జరిపారు. కోల్‌కతా ఉద్రిక్తతలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ దృశ్యాలను చూస్తూ బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన ఆందోళనలతో పోలుస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మమత రాజీనామాకు పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.
————————