* ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ పరిరక్షణలో కీలక పాత్ర
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
* సుప్రీం కోర్టుకు 75 ఏళ్లు సందర్భంగా స్మారక చిహ్నం స్టాంప్ విడుదల
ఆకేరు న్యూస్ డెస్క్ : సుప్రీం కోర్టు(Suprim Court)కు 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్మారక చిహ్నం స్టాంప్‌ను శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)విడుదల చేశారు. దిల్లీలోని భారత మండపంలో జరిగిన జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సులో ఈ మేరకు మోదీ మాట్లాడారు. ఈసందర్భంగా అత్యున్నత న్యాయస్థానాన్ని రాజ్యాంగ పరిరక్షుడిగా అభివర్ణించారు. ఎమర్జెన్సీ సమయం(Emergency Time)లో రాజ్యాంగ రక్షణలో కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రాథమిక హక్కులకు రక్షించింది. వాటితో పాటు జాతీయ ప్రయోజనాలకు సంబంధించి ప్రశ్న ఎదురైనప్పుడు సుప్రీం న్యాయస్థానం ఎప్పుడూ జాతీయ సమగ్రతను కాపాడుతూ వచ్చిందన్నారు. అయితే, మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయి. సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ(Modi) అన్నారు.