* ఎన్నికల ప్రచారంలో మరోసారి భద్రతా వైఫల్యం..
ఆకేరు న్యూస్ డెస్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై గత నెల 16న జరిగిన దాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కాగా.. ఇప్పుడు మరోసారి ట్రంప్ పై దాడికి యత్నం జరిగింది. పెన్సిల్వేనియా (Pennsylvania)లోని జాన్స్టౌన్ (Johnstown)లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్ పై దాడి చేసేందుకు అతుడు దూసుకెళ్లాడని పోలీసులు పేర్కొన్నారు. మరోసారి ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.