
* రిటైర్డ్ జస్టిస్ ఎన్ వి రమణ
* రవీంద్రభారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ
ఆకేరున్యూస్, హైదరాబాద్ : సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారని రిటైర్డ్ జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిసంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ కమ్యూనిస్టు నేతల్లో ఎంతో ఆదర్శప్రయాంగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించిన నేత సురవరం అన్నారు. విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారని అన్నారు. తాను కూడా వామపక్ష భావాలు కలిగిన వ్యక్తినే అని రమణ అన్నారు.
ప్రజాస్వామిక వాది…
సురవరం గొప్ప ప్రజాస్వామిక వాది అని దశాబ్దానికిపైగా సురవరం, తాను కలిసి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని జీవీ రాఘవులు అన్నారు. అనేక పోరాటాలు, ఉద్యమాల్లో కలిసి పని చేశామని వివరించారు. సురవరం సుధాకర్రెడ్డ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కమ్యూనిస్టులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
విలువలతో కూడిన రాజకీయాలు..
తాను ఎన్ ఎస్ యూ ఐ నాయకుడిగా ఉన్నప్పుడు సురవరం సుధాకర్రెడ్డని కలిశానని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ గుర్తుచేసుకున్నారు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో మళ్లీ కలిసినట్లు చెప్పారు. కమ్యూనిజం ఎప్పుడూ సజీవంగా ఉంటుందన్నారు. సురవరం నిబద్ధతతో రాజకీయాలు నడిపారన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రొఫెసర్ హరగోపాల్, గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు.
………………………………………………………..