
* ఆమెలో పారేది కొండా దంపతుల రక్తం
* నా శాఖలకు న్యాయం చేస్తున్నా: కొండా సురేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ (KONDA SUREKHA) తెలిపారు. నిబంధనల ప్రకారమే తాను పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. మీనాక్షి నటరాజన్ (MINAKSHI NATARAJAN) తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రిగా ఇప్పటి వరకు తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తన శాఖలో ఉన్న ఫైళ్లన్నీ పరిశీలించుకోవచ్చని సూచించారు. తన మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా స్పందించానన్నారు. సుష్మితలో పారేది కొండా మురళి, సురేఖల రక్తం అన్నారు. తమ కుమార్తెకు తమ ఆలోచనలు వంశపారం పర్యంగా రావడంలో తప్పులేదన్నారు. ఆమె రాజకీయ ఆలోచనలను తప్పుబట్టలేమన్నారు. పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ఇన్ స్టాగ్రామ్‌లో కొండా సుష్మిత పోస్టు చేయడంపై ఆమె స్పందించారు. కాగా, ఎమ్మెల్యేలు కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని, పోలీసులతో తమ అనుచరులను బెదిరిస్తున్నారని కొండా మురళి లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. సురేఖ మంత్రి అయినప్పటికీ, జిల్లాలో ఆమెకు తెలియకుండానే ఆలయ కమిటీలో పోస్టింగ్ లు ఇస్తున్నారని అన్నారు.
* పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించుకుంటా
కాంగ్రెస్ పార్టీని బతికించడమే తన లక్ష్యమని కొండా మురళి (Konda Murali) అన్నారు. రేపటి మీటింగ్‌పై వరంగల్ (Warangal) నుంచి జనసమీకరణపై మీనాక్షి తమతో చర్చించినట్లు తెలిపారు. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించుకుంటానని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలుస్తామన్నారు. తన కుమార్తె పరకాలలో పోటీ విషయం తెలియదన్నారు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయన్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆదేశాలు పాటిస్తామన్నారు. మరో పదేళ్లు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని సీఎంగా చూడడమే తమ లక్ష్యమన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. మహేశ్ కుమార్ గౌడ్‌కు సహకరిస్తామని పేర్కొన్నారు. తనకు ప్రజా బలం ఉందని, అలాంటి వారిపైనే బండలు వేస్తుంటారన్నారు. మీనాక్షి నటరాజన్ కు అన్నీ వివరించామన్నారు. రేపటి మీటింగ్ కు వరంగల్ నుంచి వచ్చే జన సమీకరణపై మాట్లాడినట్లు తెలిపారు. తనతో ఎవరికీ విభేదాలు లేవని, తాను ఎవరితోనూ విభేదాలు పెట్టుదలుచుకో లేదన్నారు. మీనాక్షీ నటరాజన్‌కు అన్నీ వివరించామన్నారు.
…………………………………………..