
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వల్ప అస్వస్థకు లోనై
ఆస్పత్రిలో చేరారు. ఉదయం మార్నింగ్ వాక్కు బయలు దేరిన స్టాలిన్ కు కొద్దిగా కళ్లు తిరిగినట్లు మగతగా అన్పించడంతో వెంటనే ఆయన్ను చైన్నైలోని ఆపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అపోలో వైద్యులు స్టాలిన్ కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. స్టాలిన్ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని ఆయనకు కావాల్సిన వైద్య పరీక్షలు నిర్వహించామని అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ అనిల్ ఓ ప్రకటలో తెలిపారు. ప్రస్తుతం స్టాలిన్ వెంట ఆయన కుమారుడు ఉధయనిధి స్టాలిన్ ఉన్నారు. స్టాలిన్ ఆస్పత్రిలో చేరాడనే వార్త విన్న డీఎంకే శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.
…………………………………………..