* అగ్గి రాజేసిన బుద్దా వెంకన్న వ్యాఖ్యలు
* చంద్రబాబు డైరెక్షన్ లోనే బుద్దా : వైసీపీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సోషల్ మీడియాలో మరోసారి తెలుగుదేశం వర్సెస్ జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ల వార్ నడుస్తోంది. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదని, పదిహేనేళ్లుగా ఆయన పార్టీని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. అసలు జూ.ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు రావాల్సిన అవసరం ఏముందని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. నారా లోకేశ్‌ని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని, అప్పుడే పార్టీ మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందన్నారు వ్యాఖ్యానించిన బుద్దా.. అనంతరం ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ 2014 , 2019 , 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేయలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని మాట్లాడుతున్నారని ఈ అంశాన్ని లెవనెత్తాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు, లోకేశ్ ల మెప్పు పొందాలనుకుంటే మీ ఇష్టమని, అనవసరం ఎన్టీఆర్ ను ఎందుకు కలుపుతున్నారని జూనియర్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇదే అదునుగా వైసీపీ రంగ ప్రవేశం చేసింది. ఎక్స్ లో విమర్శలు గుప్పించింది. ‘టీడీపీకి అసలు వారసుడైన ఎన్టీఆర్‌పై టీడీపీ నేత వెంకన్న నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో ఈ మాటలు అనిపిస్తోంది చంద్రబాబు కాదా? రాజకీయాలకు పనికిరాని లోకేశ్‌ను పైకి తీసుకురావడానికి సీబీఎన్ చేసే వెన్నుపోటు రాజకీయాలకు ఇదే నిదర్శనం’ అని పేర్కొంది.
—————————-