
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఉద్యమ కారుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి పురస్కరించుకొని జిల్లా సంక్షేమ భవన్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కొమురయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం, తెలంగాణ సాయుధ పోరాటానికి మహోన్నత ఉద్యమానికి ఆద్యుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సర్దార్ సింగ్, నరిగె రాజుకుమార్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు, సాంబయ్య జిల్లా కురుమ సంఘం ఉప అధ్యక్షుడు, యార మల్లయ్య, గోవింద రాజుకుమార్ కురుమ యువ చైతన్య అధ్యక్షుడు నరిగె సంపత్ ములుగు మండల అధ్యక్షుడు రాసా కుమార్ ములుగు జిల్లా కోశాధికారి, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియషణ్ ములుగు జిల్లా అధ్యక్షుడు గుల్లగట్టు సంజీవ, ఎస్సీ వెల్ఫేర్ అధికారి లక్ష్మన్, బిసి కార్యాలయ సిబ్బంది, బిసి వెల్ఫేర్ శాఖా ఉద్యోగులు సరిత, మానస, రేణుక, సాడలు, కుమారస్వామి, ప్రతాప్, గోపాల్ చారి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….