* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ భవన్లో కార్మిక విభాగం క్యాలెండర్ను బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం(CONGRESS GOVERNMENT)పై విమర్శలు గుప్పించారు. ఏడాదిలోనే లక్షా 40 వేల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి (REVANTREDDY)ఒక్క కొత్త పనికూడా చేయలేదన్నారు. అప్పులు చేశారంటూ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని, అభయ హస్తం హామీలు ఇచ్చినప్పుడు అప్పుల పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. హామీల అమలుపై నాలుగేళ్లు కాంగ్రెస్ పై పోరాడదామని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఐదారు సార్లు ఎంపీలు, మంత్రులు అయినోళ్లం తమకు సంపద సృష్టించుడు తెలుసు అని అవి ఇవి అని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ నేతలకు ఇప్పుడేమైందని విమర్శించారు. ఇక్కడకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరైనా రావొచ్చని, ఇది తెలంగాణ భవన్(TELANGANA BHAVAN) కాదని, తెలంగాణ జనతా గ్యారేజీ అని ప్రకటించారు.
…………………………………………………………..