The Paradise Second Single launch
* అనిరుధ్ కాన్సర్ట్‌లో పాట ఆవిష్కరణ
* నానితో కలిసి సందడి చేయనున్న రాక్‌స్టార్ అనిరుధ్
* ఆగస్టు 29న డిజిటల్ రిలీజ్
అకేరు న్యూస్, సినీ డెస్క్:
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
తాజాగా చిత్రబృందం సెకండ్ సింగిల్‌ను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. హై ఎనర్జీ ఫోక్ మాస్ ఆంథమ్‌గా రూపొందిన ఈ పాటను ఆగస్టు 28న అమెరికాలోని డల్లాస్‌లో జరిగే అనిరుధ్ రవిచందర్ కాన్సర్ట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. వేలాది మంది అభిమానుల సమక్షంలో లైవ్ సెలబ్రేషన్స్ మధ్య పాటను ఆవిష్కరించనున్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని కూడా అనిరుధ్‌తో కలిసి సందడి చేయనున్నారు. ఇప్పటికే సెకండ్ సింగిల్ లాంచ్ కోసం నాని డల్లాస్ చేరుకున్నారు. దీంతో డల్లాస్ కాన్సర్ట్‌లో ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్ లాంచ్ మరింత ప్రత్యేకంగా మారనుంది.
కాన్సర్ట్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించిన అనంతరం ఆగస్టు 29న ఈ పాటను ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌గా విడుదల చేయనున్నారు. దీంతో నాని అభిమానులతో పాటు అనిరుధ్ మ్యూజిక్ లవర్స్ కూడా ఈ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో మోహన్ బాబు, కయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు సాంకేతికంగా కూడా ప్రముఖులే పనిచేస్తున్నారు. ఛాయాగ్రహణం సిహెచ్. సాయి, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు.
‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
YES, it’s #YESHANAGULA 🔥🔥🔥💥💥
Lyrics: Kasarla Shyam
Singers: Jangi Reddy, Prabha.
Music: Anirudh.Out on August 29th 🙂 pic.twitter.com/JcwGcYNDZF
— Srikanth Odela (@odela_srikanth) August 27, 2026

Please tell us what is wrong. Your report will be sent to the website team.
