* కేసీఆర్ నుంచి పిలుపు
* ఫిరాయింపులకు కళ్లెం వేసేందుకు గులాబీ బాస్ సన్నద్ధం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గులాబీ బాస్ కేసీఆర్ (KCR) అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో మిగిలినవారినైనా కాపాడుకోవడానికి సిద్ధమయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారని, వారి పేర్లతో సహా జాబితా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వారితో సమావేశం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ తరఫున ఓవైపు అసెంబ్లీ స్పీకర్‌కు వినతి పత్రాలు ఇస్తూనే.. మరోవైపు, హైకోర్టును, సుప్రీం కోర్టును ఆశ్రయించి ఫిరాయింపులను అడ్డుకోవాలని యోచిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేల్లో భరోసా నింపాలని, వారు సొంత పార్టీలోనే ఉండేలా చర్చలు జరపాలని భావిస్తున్నారు. ఆలస్యం చేస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందన్న పార్టీ పెద్దల సూచనల మేరకు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈమేరకు ఎమ్మెల్యేలకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో గ్రేటర్ ఎమ్మెల్యేలు మాధవరం కాంతారావు, వివేకానంద్, ఆరెకపూడి గాంధీ, కాలేరు వెంకటేష్ ఫాంహౌస్‌కు బయలుదేరినట్లు తెలిసింది.
—————————-