మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి
* పంజాగుట్టలోని విగ్రహం వద్ద పుష్పాంజలి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళి అర్పించారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్శంగా హైదరాబాద్ పంజాగుట్టలోని ఆయన విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీఆర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు సీఎం వెంట ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్ ఆర్ అమర్ రహే అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతుకు ముందు ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన వైఎస్ ఆర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షీతో కలిసి తిలకించారు.
———————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
