ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు మూడో విడత ఎన్నికలు జరుగుతుండగా రాత్రి వరకు ఓట్ల లెక్కింపు ముగిసి.. ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఈ నెల 20న గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయడానికి అధికారులు నిర్ణయించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ వాయిదా వేశారు. ఈ గడువును డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేశారు. డిసెంబర్ 20న పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. సరైన ముహూర్తాలు లేవని, ఆ రోజు బాధ్యతలు స్వీకరించడం మంచిది కాదని భావించిన పలువురు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో నూతన సర్పంచుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీ రాజ్ శాఖ, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని రెండు రోజులు వెనక్కి జరిపి డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయించింది.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
