Amberpet Shankar Rowdy Sheet
ఆకేరు న్యూస్, హైదరాబాద్: అంబర్‌పేటకు చెందిన శంకర్ (Amberpet Shankar)పై పోలీసులు మరోసారి రౌడీషీట్ తెరిచారు. జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధుల్లో బెదిరింపులకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు రావడంతో అంబర్‌పేట పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
గతంలోనూ శంకర్‌పై రౌడీషీట్ నమోదై ఉండగా.. 2019లో పోలీసులు దానిని మూసివేశారు. అయితే ఇటీవల అతడిపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో మరోసారి రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా కేసుల నేపథ్యంలో శంకర్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. అతడి కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
