Srirastu
ఆకేరు న్యూస్, సినిమా: ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీరస్తు’. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి శంకర్ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. హరి క్రియేషన్స్ పతాకంపై పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు, నిర్మాతకు ఇది తొలి సినిమా కావడం విశేషం.
కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యువతను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ప్రజ్వల్ దేవరాజ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సుమన్, దేవి ప్రసాద్, అమని, చైత్ర రాయ్, ప్రసాద్ బెహ్రా, రవి ప్రకాష్, రవి శివ తేజ తదితరులు నటిస్తున్నారు.
శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల సరస్వతి సినిమాటోగ్రఫీ, శ్రీ వర్కల ఎడిటింగ్, కృష్ణ మాయ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ‘శ్రీరస్తు’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాదే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
