Huzurabad Sewage Treatment Plant
* హుజూరాబాద్, జమ్మికుంటలకు మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ ల మంజూరు
* హర్షం వ్యక్తం చేసిన వొడితల ప్రణవ్
* ప్రజల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
ఆకేరు న్యూస్, హుజూరాబాద్:
తెలంగాణలోని 101 పట్టణాల్లో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ ప్రాజెక్టుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 3,705.75 కోట్ల నిధులను మంజూరు చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన జీ.ఓ.ఆర్టి. నం.543 ప్రకారం హుజూరాబాద్, జమ్మికుంటల మున్సిపాలిటీలకు మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ ల మంజూరుపై హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ ప్లాంట్ల ఏర్పాటు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, వెలువడుతున్న మురుగునీటిని శుద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడవచ్చు అన ఆయన పేర్కొన్నారు.
* ప్రజల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
స్థానిక పరిస్థితులు, మున్సిపాలిటీలలో ఉన్న సమస్యల పై తాను చేసిన విన్నపాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి నిధులు, జీవో విడుదల చేసినందుకు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వొడితల ప్రణవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీలలో నెలకొన్న మిగతా సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో మెరుగైన మురుగునీరు శుద్దీకరణ వ్యవస్థ ఏర్పడనుంది.
ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం ప్యాకేజ్-1 కింద హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలు ఎంపికయ్యాయి. ఈ రెండు మున్సిపాలిటీలలో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం మొత్తం ₹45 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా హుజూరాబాద్‌కు మొత్తం 6.00 MLD సామర్థ్యంతో 2 , జమ్మికుంటకు 5.00 MLD సామర్థ్యంతో 1 మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లు నిర్మాణం జరగనుంది.
