* తింటూ, తాగుతూ కొట్లాడతా
* దీక్ష విరమించిన మోతీలాల్ నాయక్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ (Motilal Naik) దీక్ష విరమించారు. తొమ్మిదిరోజులుగా గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) దీక్ష చేస్తున్న ఆయన కొబ్బరినీళ్లు తాగి దీక్ష విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇన్నిరోజులు అన్నపానీయాలు లేకుండా ఆమరణ దీక్ష చేశా. రేపటి నుంచి నిరుద్యోగుల సమస్యలపై ఆందోళనలు చేపడతాం. రేపటి నుంచి తింటూ, తాగుతూ కొట్లాడతా. తన ఆరోగ్యం సరిగ్గా లేదని, క్రియాటిన్ లెవల్స్ పెరిగి కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, కరెంటు వచ్చినయ్. 25 నుంచి 35 ఏండ్ల వయస్సు యువత ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలే. డీఎస్సీ రద్దు చేసి.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలి. నాకు మద్దతు తెలిపిన రాజకీయ నాయకులందరికీ కృతజ్ఞతలు. మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు’ తెలిపారు.
—————————————