Telangana Apprenticeship Cum Job Mela 2026
* యూనిఫామ్ సర్వీసుల్లో 7,437 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో భారీ తీపి కబురు అందించింది. పోలీస్ శాఖతో పాటు వివిధ యూనిఫామ్ సర్వీస్ విభాగాలలో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.
* భర్తీ చేయనున్న విభాగాలు..
ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా క్రింది విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు:
* పోలీస్ శాఖ (Police Department)
* అగ్నిమాపక శాఖ (Fire Department)
* జైళ్ల శాఖ (Prisons Department)
* స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)
*ప్రక్రియ ఏ దశలో ఉందంటే?
ప్రస్తుతం స్థానిక కేడర్ల వారీగా పోస్టుల విభజన, రోస్టర్ పాయింట్ల ఖరారు వంటి కీలక వివరాలపై హోంశాఖతో పాటు ఆయా సంబంధిత విభాగాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఈ వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి కాగానే, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి స్థాయి నియామక నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.
అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ను ప్రారంభించవచ్చు.
* యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ వివరాలు (మొత్తం పోస్టులు: 7,437)
1. పోలీస్ శాఖ (Police Department)
వివిధ హోదాల్లో భర్తీ చేయనున్న ఖాళీల వివరాలు:
* సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్) 148
* రిజర్వ్ ఎస్ఐ (ఏఆర్) – 14
* రిజర్వ్ ఎస్ఐ (టీజీఎస్పీ) – 12
* రిజర్వ్ ఎస్ఐ (ఎస్ఏఆర్ సీపీఎల్)
* అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) – 23
* పోలీసు కానిస్టేబుల్ (సివిల్) – 3,697
* కానిస్టేబుల్ (ఏఆర్) – 1,052
* కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్)- 24
* కానిస్టేబుల్ (డ్రైవర్) – 20
* కానిస్టేబుల్ (మెకానిక్) – 7
2. అగ్నిమాపక శాఖ (Fire Department)
* స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 39
* ఫైర్ ఫైటర్ – 751
3. జైళ్ల శాఖ (Prisons Department)
* డిప్యూటీ జైలర్ (పురుషులు) -14
* డిప్యూటీ జైలర్ (మహిళలు) -01
* వార్డర్ (పురుషులు) 196
* వార్డర్ (మహిళలు)- 12
4. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)
* సబ్ ఇన్స్పెక్టర్ -44
* కానిస్టేబుల్ -1,380
Please tell us what is wrong. Your report will be sent to the website team.
